దుబాయ్ లో సుజాత పుట్టినరోజు వేడుకలు...సందడి చేసిన రాకేష్
on Jan 5, 2023
.webp)
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ భామ, జోర్దార్ సుజాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దేశవిదేశాల చుట్టేసి వస్తున్నారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మంచి స్కిట్స్ వేస్తూ తనని తాను నిరూపించుకుని టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఎప్పుడైతే సుజాతకి, రాకేష్ కి మధ్య లవ్ ఎఫైర్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఒక టీమ్ కి స్కిట్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడికెళ్లినా సుజాత పక్కన లేకుండా రాకేష్ మాత్రం ఎక్కడికీ వెళ్లడం లేదు.
ఇప్పుడు సుజాత బర్త్ డే సెలెబ్రేషన్స్ ని దుబాయ్ లో గ్రాండ్ గా చేసుకున్నారు ఇద్దరూ. రాకేష్ తెగ సందడి చేసాడు. కొత్త ఏడాది ఇద్దరికీ బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. రాకేష్ యాడ్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ కలిసి దుబాయ్ ట్రిప్ వేసి వచ్చారు.
ఇక ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లి బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆ ఫొటోస్ ని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నట్టు కనిపిస్తోంది. రాకింగ్ రాకెష్ ఫాన్స్ అంత సుజాతకు బర్త్డే విషెస్ చెప్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



